ఎట్టకేలకు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫౌంహౌస్ వీడి బయటకు వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేజారక ఆయన ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. కూతురు కవిత అరెస్టు సమయంలోనూ బయటకు రాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా.. తన కొడుకు, మాజీ మంత్రి కేటీఆర్ మీద ప్రభుత్వం కేసులు పెట్టడం, బీఆర్ఎస్ నేతలపైనా కేసులు పెట్టి వేధిస్తున్నా కేసీఆర్ మౌనం వహించారు.
అయితే, తన సోదరి చీటి సకలమ్మ అనారోగ్యంతో మరణించిందని తెలియగానే శనివారం ఉదయం కేసీఆర్ ఆమె ఇంటికి వెళ్లారు. దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ గారి పార్థివదేహానికి నివాళులర్పించారు. సకులమ్మ గారి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు.ఆయన వెంటనే బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారు. అంతకుముందు హరీశ్ రావు, కేటీఆర్, కవిత సైతం సకలమ్మ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు.