భక్తులకు అలర్ట్.. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్

-

ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి అదేశించారు.

Kedarnath Temple: A Spiritual Journey Amidst the Himalayas

ఇవాళ ఉదయం 8 గంటల వరకు 5828 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం రుద్రప్రయాగ, సోన్‌ప్రయాగ, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో హరిద్వార్‌లో అత్యధికంగా 78 మి.మీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దేహ్రాదూన్‌లో 33.2 మి.మీ., ఉత్తరకాశీలో 27.7 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news