ఓరి నాయనో.. బాటిల్ దించకుండా కల్లు తాగేసిన కీర్తి.. షాకైన నాని

-

టాలీవుడ్ బ్యూటీ.. మహానటి కీర్తిసురేశ్ ప్రస్తుతం నానితో కలిసి దసరా మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న దృష్యా.. ఈ జంట ముంబయి, హైదరాబాద్, చెన్నై అంటూ ఇలా ప్రమోషన్స్ కోసం పలు రాష్ట్రాలు చక్కర్లు కొడుతోంది. ముంబయిలో జరిగిన దసరా మూవీ ప్రమోషన్స్ లో కీర్తి, నానితో పాటు నటుడు రానా కూడా పాల్గొన్నారు.

అయితే ముంబయిలో జరిగిన దసరా సినిమా ప్రమోషన్స్ లో కీర్తి చేసిన పని చూసి నాని, రానాలతో పాటు అందరూ షాకయ్యారు. దసరా చిత్రంలో తాను మందు తాగి పలు సీన్లు చేశానని నాని చెప్పారు.. ఈ మూవీలో నాని బాటిల్ దించకుండా మందు తాగేస్తారట.

ఈ సినిమా ప్రమోషన్లలో కూడా నాని అలాగే చేశారు. నానితో పాటు రానా కూడా జతకట్టి ఎత్తిన బాటిల్ దించకుండా కల్లు తాగారు. వీళ్లిద్దరిని చూసిన కీర్తి.. తాను కూడా ఏం తక్కువ కానని.. ఎత్తిన బాటిల్ దించకుండా కల్లు తాగేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news