ఎల్ఐసి సూపర్ పాలసీ.. రూ.300 పొదుపు చేస్తే రూ.50లక్షలు పొందే అవకాశం..

-

ఎటువంటి రిస్క్ లేకుండా పొదుపు చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎల్ఐసి పాలసీలు కూడా ఉన్నాయి..ఎల్ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిల్లో బీమా రత్న పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండిజీజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్..ఈ పాలసితో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..

ఇకపోతే ఫార్ట్ టర్మ్ పేమెంట్ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బోనస్ పొందొచ్చు. కనీసం రూ. 5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదినుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారి పేరుపై ఈ ప్లాన్ పొందొచ్చు.పాలసీ ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించొచ్చు. ఈ ప్లాన్ టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. మీరు ఎంచుకున్న టర్మ్ కన్నా తక్కువ కాలం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మీకు 30 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. మీరు 25 ఏళ్ల టర్మ్‌తో రూ. 20 లక్షల బీమా మొత్తానికి ఈ ప్లాన్ తీసుకుంటే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 48.5 లక్షల వరకు లభిస్తాయి. నెలవారీ ప్రీమియం రూ. 9,600 వరకు పడుతుంది. అంటే మీరు రోజుకు రూ. 320 పొదుపు చేస్తే సరిపోతుంది.21 ఏళ్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మీరు ప్రీమియం రూపంలో చెల్లించే మొత్తం రూ. 24 లక్షలు అవుతుంది. అంటే మీకు రెట్టింపు బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చు. కాగా మీకు రెండు సార్లు రూ.5 లక్షల చొప్పున లభిస్తాయి..

పాలసీ దారుడు ఒకవేళ మరణిస్తే..డెత్ క్లెయిమ్ రూ. 40 లక్షలు వస్తుంది. సహజ మరణం అయితే ఈ బీమా మొత్తం పొందొచ్చు. అదే ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ. 50 లక్షలు బీమా మొత్తం చెల్లిస్తారు.గ్యారంటీ బోనస్ కూడా ఉంటుంది..షార్ట్ టర్మ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్‌తో అధిక బెనిఫిట్ పొందొచ్చు. మీరు ఎంచుకునే బీమా మొత్తం పెరిగే కొద్ది మీకు వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా పెరుగుతూ ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news