ప్రభుత్వ పాఠశాల ని బాగు చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ కక్షలో భాగంగా అరెస్టు చేసారని గుజరాత్ లో నేరాలు చూసిన వాళ్ళని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామిరెడ్డి అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉద్యమ ఆకాంక్షలు విద్యా ప్రమాణాలు ప్రభుత్వ కార్యకర్తలు అనే అంశం మీద నిర్వహించిన సదస్సులో పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తో కలిసి కోదండ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. అధ్యాపకులు యూనివర్సిటీ ప్రొఫెసర్ల పోస్టులని భర్తీ చేయాలని అనీ యూనివర్సిటీలకి పూర్వ వైభవం రావాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్య మరింత బలోపేతం అవుతుందని నమ్మకం ఉందని అన్నారు.