పంజాబ్ లో మొత్తం 13 లోక్సభ స్థానాలు చండీగఢ్లో ఒక స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు త్వరలోనే ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులని ఫిక్స్ చేస్తామని అన్నారు. శనివారం ఆయన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు పంజాబ్లో ఇండియా కూటమితో పొత్తు ఉండబోతుందని అన్నారు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ఆప్ ని ఆశీర్వదించింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు.
14 స్థానాల్లో అభ్యర్థుల్ని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేసిన ప్రకటన తో ఇండియా కూటమి ఆందోళనలో పడింది కేజ్రీవాల్ ప్రకటన ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకోపక్క గోవా హర్యానా గుజరాత్ లోక్సభ స్థానిక స్థానాలకి అభ్యర్థులని నిర్ణయించేందుకు ఫిబ్రవరి 13న ఆప్ సమావేశాన్ని నిర్వహించనుంది.