కేజ్రీవాల్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ 48 స్థానాలు, ఆప్ 22 స్థానాలను కైవసం చేసుకోనుంది. ఇప్పటికే బీజేపీ 41 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఉదయం నుంచి నువ్వా నేనా..? అన్నట్టు కొనసాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం వరకే ఓ క్లారిటీ వచ్చేశాయి. బీజేపీ విజయం సాధిస్తుందని కన్మర్మ్ అయిపోయింది. అనుకున్నట్టుగానే బీజేపీ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సంచలన వ్యాక్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్యారెంటీలపై ఢిల్లీ ఓటర్లు నమ్మకం ఉంచారని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ఓటమి ఆ పార్టీ కే కాదు..ప్రతిపక్షాలకు మొత్తం అన్నారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని వెల్లడించారు. పార్టీ ఢిల్లీ అద్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ విషయంలో గర్వంగా ఉన్నామని.. ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు తివారి.