ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని.. ప్రజలను కాపాడాలని అడిగినందుకు కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ వాసులు ఎదుర్కుంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లితే పరిష్కారం చూపిస్తుందని తాను భావించానని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షఆ స్పందించి చర్యలు చేపడుతారని భావించా.. కానీ తననే టార్గెట్ చేస్తారని. ఇలా దాడులు చేపిస్తారని అనుకోలేదని మండిపడ్డారు.
వచ్చే ఏడాది జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కానీ.. కూటమిలోని ఇతర పార్టీలతో కానీ ఆప్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎవ్వరితో కూడా పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వివరించారు అరవింద్ కేజ్రీవాల్.