“కేరళ” రాష్ట్రము పేరు మార్చేసిన సీఎం పినరయి విజయన్ … !

-

సౌత్ ఇండియాలో మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ లు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశం సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. దేశం అంతా మన దక్షిణ భారతదేశాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కేరళ పేరును “కేరళం” గా మార్చేశారు. కేరళ సీఎంగా ఉన్న పినరయి విజయన్ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్రము యొక్క పేరును మార్చడానికి ఒక బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింది. కాగా ఈ బిల్లుకు అనుకూలంగా ఎక్కువ మంది మద్దతు తెలపడంతో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించింది.

కాగా ఈ రాష్ట్రము యొక్క పేరును రాజ్యాంగం లోని 8 వ షెడ్యూల్ ప్రకారం అన్ని అధికారిక భాషలలోనూ కేరళ కు బదులుగా కేరళంగా మార్చాలని అసెంబ్లీ స్పీకర్ ఆమోదాన్ని తెలిపారు. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news