మరో మైలురాయిని దాటిన కేరళ స్టోరీ సినిమా

-

డైరెక్టర్ సుదీప్తో సేన్ కేరళ స్టోరీ మూవీకి దర్శకత్వం వహించారు.మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ సినిమా లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం బడ్జెట్‌ కేవలం రూ. 35 కోట్లే . కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌ , తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించుకుండా నిషేధం విధించారు.

చాలా నెలల తర్వాత ఇటీవలే కేరళ స్టోరీ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.థియేటర్లలో విడుదల అయిన సుమారు 9 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ అయింది .ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టిస్తూ….అంచనాలకు మించి వ్యూస్ అందుకుంటుంది. 15 రోజులుగా జీ5 ఓటీటీలో నేషనల్ వైడ్‍లో ఈ సినిమా ట్రెండింగ్ లిస్టులో నంబర్ వన్ ప్లేస్‍లో కొనసాగుతోంది. ఈ చిత్రం తాజాగా 300 మిలియన్ల వాచ్ మినిట్స్ మైలురాయిని కూడా దాటేసింది.

Read more RELATED
Recommended to you

Latest news