మంచిగా టూర్ వేసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు గుడ్ న్యూస్.
కేరళ అందాలు చూడాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ ప్యాకేజీ ని తీసుకొచ్చింది.
హైదరాబాద్ నుంచి కేరళకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇక వివరాలు చూస్తే.. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని తీసుకెళ్లి కేరళ అందాలు చూపించనుంది. కల్చరల్ కేరళ పేరు తో ఈ టూర్ ని తెచ్చారు. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. అక్టోబర్ 2న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవ్వనుంది.
కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే… ఉదయం 6.40 గంటలకు కొచ్చిన్ రీచ్ అవుతారు. ఫ్రెషప్ అయ్యాక కొచ్చి టూర్. జ్యూయిష్ సినాగోగ్, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్స్ ని మీరు ఈ ప్యాకేజీ కింద చూడొచ్చు. సాయంత్రం మెరైన్ డ్రైవ్. రాత్రికి కొచ్చిలో బస చేయాలి. రెండో రోజు మున్నార్.
దారిలో చీయపార వాటర్ ఫాల్స్ చూడొచ్చు. టీ మ్యూజియం ని చూడచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు మున్నార్ సైట్‌సీయింగ్. మెట్టుపెట్టి డ్యామ్, ఈకో పాయింట్, కుండ్ల డ్యామ్ లేక్. రాత్రికి మున్నార్‌లో ఉండాలి. నాలుగో రోజు తేక్కడి టూర్ ఉంటుంది. సుగంధ ద్రవ్యాల తోటలు చూడొచ్చు. రాత్రికి తేక్కడిలో ఉండాలి. ఐదో రోజు అలెప్పీ లేదా కుమారకోమ్. ఆరో రోజు చడియమంగళం రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఏడో రోజు ఉదయం పద్మనాభ స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. నేపియర్ మ్యూజియం చూడొచ్చు. రాత్రి 9.55 గంటలకు త్రివేండ్రంలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ వచ్చేస్తారు. https://www.irctctourism.com/ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.