దేశవ్యాప్తంగా నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి తెచ్చి భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నా కొందరు వాహనదారుల్లో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. మేము మారం.. మా తీరు ఇంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి తెచ్చి భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నా కొందరు వాహనదారుల్లో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. మేము మారం.. మా తీరు ఇంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డుపై ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అయితే అలాంటి ఓ డ్రైవర్‌కు ఓ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. కేరళలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కేరళలోని ఓ ప్రాంతంలో రోడ్డుపై రాంగ్ రూట్‌లో బస్సు వస్తుండగా దానికి ఎదురుగా టూవీలర్‌పై వెళ్తున్న ఓ మహిళ పక్కకు తప్పుకోకుండా అలాగే తన వాహనాన్ని బస్ ఎదుట నిలిపింది. మామూలుగా అయితే ఎవరైనా సరే.. తమ ముందు ఉన్న వాహనాలు రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చినా సరే.. తప్పించుకుని ముందుకు వెళ్లిపోతారు. కానీ ఆమె అలా చేయలేదు సరికదా.. ఆ బస్‌కు తన వాహనాన్ని ఎదురుగా నిలిపింది.
అయితే ఆ మహిళ చేసిన సాహసానికి షాకైన బస్సు డ్రైవర్ గత్యంతరం లేక.. ఏమీ చేయలేక.. తిరిగి తన బస్సును కొంత వెనక్కి తీసి మళ్లీ పక్కన కరెక్ట్ లైన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఎవరో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కాగా ఆ మహిళ ధైర్యసాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఇలాగే బుద్ధి చెప్పాలంటూ.. ఆమెను అభినందిస్తున్నారు..!