కృష్ణాష్టమి వేడుకలలో 5 గురు మృతి చెందారు. రామంతపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం అని కేటీఆర్ స్పందించారు. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనదన్నారు.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.