తుంగభద్ర డ్యామ్ పై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కీలక ప్రకటన ప్రకటన చేశారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరం అన్నారు. తుంగభద్ర డ్యామ్ కర్నాటక- ఆంధ్రా- తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయిని అని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ లో 40 టిఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుంది అని తెలిపారు.
వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామన్నారు. ఇక రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమే అన్నారు. ఇందుకోసం రైతులు కూడా సహకరించాలని కోరారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.