అమెరికా పై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

-

అమెరికా పై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు హసీనా. తాను మృతదేహాల ఊరేగింపు చూడాలనుకోలేదు. వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. దానిని తాను అంగీకరించలేదు. అందుకే ప్రధాని పదవీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. 

ముఖ్యంగా ఈ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందని బంగ్లాదేశ్ లోనే చెప్పాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. బంగాళఖాతం పై పట్టు సాధించడానికి బంగ్లాదేశ్ కి దక్షిణాన  బే ఆఫ్ బెంగాల్ కి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సెయింట్ మార్టిన్ ఐల్యాండ్ ని అమెరికా అప్పగించాలని కోరింది. కానీ తాను దానికి అంగీకరించకపోవడంతో కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. బంగ్లాదేశ్ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తానని తెలిపారు. ఆగస్టు 05 నుంచి బంగ్లాదేశ్ లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం హసీనా భారత్ లోనే ఉంది. యూకే లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆదేశం దానిని తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news