అమరావతి : ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. పోలవరం అనుమతుల పై కీలక ప్రకటన చేశారు. పోల వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ఏపీ ప్రభుత్వానికి ఊరట ఇచ్చింది. అనుమతులు లేని కారణంతో 2011లో పనుల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర పర్యావరణ శాఖ. 2015 లో ఈ ఉత్తర్వులను అభయెన్సులో పెట్టింది కేంద్ర ప్రభుత్వం.
అభయెన్సు ఉత్తర్వులను ఏటా కొనసాగిస్తూ వచ్చిన కేంద్రం.. తాజాగా ఏపీ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి అభ్యర్థన మేరకు రెండేళ్ల పాటు కొనసాగింపులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ.
ఇది ఇలా ఉండగా ఇటీవలే పోలవరం ప్రాజెక్టుకు భారీ జరిమానా విధించింది ఎన్జీటి. పర్యావరణ అనుమతుల ఉల్లఘిస్తూ పోలవరం నిర్మాణాన్ని చేపడుతున్నందుకు రూ.120 కోట్లు జరిమానా విధించింది ఎన్జీటి. పురుషోత్త పట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టినందుకూ భారీ జరిమానా విధించింది.