ఏపీ శాసన సభలో కీలక బిల్లులు…! ఏం జరుగుతుందో…?

-

నేడు నాలుగో రోజు ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో పలు కీలక బిల్లులను జగన్ సర్కార్ ప్రవేశ పెడుతుంది. వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలలో… వరుసగా మూడు రోజులు పాటు పలువురు టిడిపి ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. నేడు అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ప్రభుత్వ అజెండా లో మొత్తం మూడు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.AP Legislative assembly session begins from June 12

రాష్ట్రంలో కరోన నియంత్రణ- అరోగ్య శ్రీ పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ సంక్షేమం, డిబిటిల పై సభలో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. పలు కీలక బిల్లులను సభలో సర్కార్ ప్రవేశ పెడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ బిల్లు తో పాటు నేడు దిశ బిల్లును సభలో ప్రవేశ పెడతారు. అలాగే మునిస్పల్ చట్టం, ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news