తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కులగణన సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సర్వే కి సంబంధించి సర్వేను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం విధితమే. అయితే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన సర్వేలో కొందరూ ఉద్దేశ పూర్వకంగా వివరాలు చెప్పలేదు. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు.
ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ వంటి వారు ఉద్దేశ పూర్వకంగా సర్వేలో వివరాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే స్పష్టంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కకు పెట్టి అభివృద్ధికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. కులగణనలో పాల్గొనని 3.1 శాతం మంది కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.