ఇంటర్ సిలబస్ మార్పు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

గత కొద్ది రోజులుగా తెలంగాణ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేయాలన్న వాదనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా తెలిపారు. నేడు ఇంటర్ బోర్డు నిర్వహించిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ సంబందించి ఏ నిర్ణయం అయినా బోర్డులో తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

గత రెండేళ్లుగా కరోనా తో మీటింగ్ నిర్వహించలేదని.. రెండేళ్లుగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించామని తెలిపారు. పాఠ్యపుస్తకాలు ప్రతి సంవత్సరం ఆలస్యంగా అందుతున్నాయన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాలు ముద్రించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా అందేలా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. గుర్తింపు పొందాల్సిన కాలేజీల విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు ప్రారంభం కాగానే గుర్తింపు కోసం దరకాస్తు చేస్తుంటారని వివరించారు.

ఇప్పటినుండి అకడమిక్ ఇయర్ లోపు అంటే మే చివరి వారం వరకు గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిన వెంటనే గుర్తింపు ఇస్తామని తెలిపారు. ఫైర్ Noc ఇవ్వాలని హోమ్ శాఖ ను అడిగామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ఏడాది అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version