కేరళలోని కరిపూర్ లోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదం ఇప్పుడు కంగారు పెడుతుంది. ఈ ప్రమాదం తీవ్రత చూసిన వాళ్ళు అయితే ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు. వారిని ఆ ఘటన ఇంకా కంగారు పెడుతుంది. దుబాయ్ నుంచి వస్తున్న విమానం రన్ వే పై క్రాష్ కావడంతో ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై విచారణ ముమ్మరం చేసారు. విమానం నుండి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) స్వాధీనం చేసుకుంది దర్యాప్తు బృందం. ఇక ఇదిలా ఉంటే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్) ను తిరిగి పొందడానికి ఫ్లోర్‌బోర్డ్ ని కట్ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారులు అక్కడే ఉండి ప్రమాద స్థలం మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.