పాపం… మళ్ళీ కడప జైలుకి జేసి

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం కాస్త సంచలనంగా మారింది. అనవసరంగా ఆయన నోటి దురుసుగా మాట్లాడి మరోసారి జైలుకి వెళ్ళారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ల కేసులో మొన్న బెయిలు పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, మొన్న రాత్రి ఇంటికి వెళుతూ సీఐ పై నోరు పారేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. దీనితో ప్రభాకర్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు తాడిపత్రి పోలీసులు.

దీనితో అట్రాసిటీ కేసులో ప్రభాకర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది గుత్తి కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన మొన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల అయి నేడు మరో సారి జైలుకి వెళ్ళడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులను ఆయన అంతు చూస్తా అని బెదిరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news