పానీపూరిని అతిగా తింటున్నారా?.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..

-

పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. సాయంత్రం 4 అయితే చాలు వీధి చివర పానీపూరి బండి వద్ద జనాలు గుమి గూడి ఉంటారు..రుచికరమైన పానీపూరితో ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పరిశోదకులు చెబుతున్నారు..అసలు ఈ పానీ పూరి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పానీ పూరి తింటున్న సమయంలో ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చాలామంది ఆలోచించరు. పానీ పూరి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా వాటిని తినకుండా అసలు ఉండలేరు. పానీపూరీలను వర్షాకాలం శీతాకాలంలో అధికంగా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. పానీ పూరి లాంటి స్ట్రీట్ ఫుడ్ తింటే టైఫాయిడ్ ఎటాక్ చేస్తుంది. ఇక శీతాకాలంలో కూడా పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను డబ్బులిచ్చి కొనుకున్నట్లే..

పిల్లల ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు..డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుందట. అలాగే విరేచనాలు, వాంతులు, కామెర్లు వచ్చే అవకాశం ఉందట. ఇంకా పానీ పూరీ వల్ల అల్సర్, జీర్ణక్రియ సమస్యలు వస్తాయట.. ఇంకా వీటిని తింటే ప్రేగులో మంట కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువుగా వీటిని తినక పోవడమే మంచిది అంటున్నారు.. కొన్ని సార్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.. విన్నారుగా జర జాగ్రత్త.. కొని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version