కియారా – సిద్దార్థ్ ఒక్కరోజు పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లు అంటే..?

-

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ పక్షులుగా గత కొంతకాలం నుంచి ప్రేమలో వివరిస్తున్న కియారా అద్వానీ , సిద్ధార్థ మల్హోత్రా ఎట్టకేలకు ఈరోజుటితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలకు అనుగుణంగానే వీరు కూడా తరచూ కలవడం.. పార్టీలకు వెళ్లడం లాంటివి అందరం చూసాం.. ఈ క్రమంలోనే ఇప్పుడు వీరి వివాహానికి సంబంధించిన పనులు అన్నీ కూడా సెరవేగంగా జరుగుతున్నాయి. కియారా సిద్ధార్థ మల్హోత్రా వివాహం రాజస్థాన్లోని జై సల్మేర్ లోని సూర్యాగడ్డ ప్యాలెస్ లో చాలా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని నిన్న ఘనంగా సంగీత్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు.

ముఖ్యంగా ఫిబ్రవరి 4, 5 , 6 తేదీలలో వీరి వివాహ వేడుకలు చాలా ఘనంగా జరగనున్నాయి తెలుస్తోంది.. ముంబై కి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారట. అంతేకాదు వీరి పెళ్లికి పెద్ద ఎత్తున సెలెబ్రిటీలతో పాటు వీఐపీలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి హాజరయ్యే వీఐపీల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారట. అతిధుల కోసం 70 లగ్జరీ వాహనాలు అయినా మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారట. అంతేకాదు బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వివాహాలలో వీరిది కూడా ఒకటిగా నిలుస్తుంది.

ఈ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్ కి ఈ ప్యాలెస్ నిలయంగా మారింది. ఒక్కరోజు ఈ ప్యాలెస్ లో వేడుక జరుపుకోవడం కోసం దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుందట.ఈ క్రమంలోనే సిద్ధార్థ కీయారా మూడో రోజులపాటు ఇక్కడ పెళ్లి వేడుకలు నిర్వహించబోతున్నారు కాబట్టి వీరి పెళ్ళి కోసం సుమారుగా రూ.6 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version