కామారెడ్డి ప్రజల చేతిలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించే బ్రహ్మాస్త్రం ఉందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన సభకు మోడీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్, రేవంత్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఓటమి భయంతోనే ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారిలో ఓడించి వారసత్వ, అవినీతి రాజకీయాలకు కామారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. యూపీఏ కూటమిని ఇండియా కూటమిగా పేరు అది మార్చారు. పేరు మార్చినంత మాత్రాన వాళ్ళ అవినీతి బుద్ధి మారదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని, ఈనెల 30వ తేదీన ఆ రెండు పార్టీలను తరిమేయాలని పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ నుంచి తెలంగాణకు ముక్తి లభించాలి. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందని ప్రజలు బీజేపీ పై ఆశ పెట్టుకున్నారన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం, బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. వాగ్దానం ఇచ్చామంటే చేసి తీరుతామని నష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీల కోసం ఏం చేయలేదు. కానీ బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని మోడీ అన్నారు. గతంలో బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తామని ఓట్లు వేయించుకుంది. తెలంగాణలో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. బీజేపీ మాదిగల సాధికారతకు కృషి చేస్తుందని తెలిపారు.