పిల్లల్లో పెరుగుతున్న శాడిజం…

-

చిన్న పిల్లల్లో శాడిజం పెరుగుతుందా…? అనే అవుననే సమాధానం వినపడుతుంది. గతంలో చిన్న పిల్లలు అంటే తల్లి తండ్రుల మాట వినడంతో పాటు వాళ్ళు చెప్పిన మాటను దాటి ఏ ఒక్క పని చేసే వారు కాదు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఏం చెయ్యాలన్నా సరే అమ్మా నాన్న అనుమతి తప్పని సరిగా ఉండేది… కాని ఇప్పటి పిల్లలు చేసి వచ్చిన తర్వాత తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. మేము ఇది చేసామని వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కనపడటం లేదు… ఇకపోతే ఇళ్ళల్లో తల్లి తండ్రులు చెప్పిన మాట వినే వాళ్ళు కూడా కరువయ్యారు…

తల్లి తండ్రులు ఏదైనా ఇవ్వకపోయినా, వాళ్లకు నచ్చినట్టు చేయకపోయినా పిల్లలు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇది తప్పని తల్లి తండ్రులు గట్టిగా చెప్తే ఇళ్ళల్లో నుంచి వెళ్ళిపోతున్నారు. స్కూల్ లో టీచర్ ని కూడా లెక్క చేయని పరిస్థితి పదేళ్ళు కూడా దాటకుండానే వస్తుంది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో యుట్టే అర్ధం చేసుకోవచ్చు… పిల్లలకు తండ్రులు గారాబం చేయడం, అడిగింది అల్లా ఇవ్వడం వంటివి వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇక చిన్న వయసులోనే చెడు అలవాట్లకు పిల్లలు బానిసలుగా మారిపోయే పరిస్థితి ఉంది.

దీనిపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది… 600 మంది పిల్లలను పరీక్షించిన సంస్థ… వాళ్లలో 70 శాతం మంది పిల్లలు తమకు ఇది కావాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారట… అది ఇవ్వకపోతే ఇళ్ళల్లో వస్తువులు పగలకొట్టే వరకు వెళ్తున్నారట. ఇక వీరిలో కొంత మంది… తల్లి తండ్రుల మాటకు విలువ ఇవ్వడం లేదని, ఫ్రెండ్స్ అని చెప్తూ ఏదైనా చేయవచ్చు అనే భావనలో ఉన్నారట. 22 శాతం మంది పిల్లల్లో పట్టుదల ఉన్నా తల్లి తండ్రుల మాటకు విలువ ఇచ్చి ఆగిపోతున్నారని, తమకు కావాలి అనుకుంటే మాత్రం తల్లి తండ్రులను కూడా లెక్క చేయడం లేదని సర్వే గుర్తించింది… 4 శాతం మంది పిల్లలు తల్లి తండ్రులు చూపించిన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారట. చివరిగా పిల్లలు తమ మాటను నెగ్గించుకోవడానికి శాడిజంగా ప్రవర్తిస్తున్నారని సర్వే పేర్కొంది. ఇంటర్నెట్ ప్రభావంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని సర్వేలో బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news