బాలుడి మృతికి 300 కోట్ల భారీ నష్టపరిహారం..ఎందుకంటే..!!!

-

అపరిచితుడు సినిమా ఇండియాలో విడుదల అయినప్పుడు ఆ సినిమాలో రామం క్యారెక్టర్ చూసి అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకున్నారు అందరూ. బండి క్లచ్ వైరు తెగిపోతే ఆ వైర్ కొన్న షాపుకి వెళ్లి, వైరు కంపెనీ అడ్రస్ తీసుకుని సదరు కంపెనీపై కోర్టులో పిల్ వేసి వైరు నాణ్యత లేదని చెప్పి నష్టపరిహారం పొందుతాడు. తనకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని కంపెనీపై కేసు ఫైల్  చేయిస్తాడు.

 

అయితే ఈ సినిమా చూసిన వాళ్ళు ఇది సినిమా కాబట్టి చూడటానికి బాగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఇది సంభవమా, అసలు ఇలాంటి వాళ్ళు ఉండరు గాక ఉండరు అనుకుంటారు. కానీ అమెరికాలోని ఓ జంట ఇలానే ఒక కంపెనీపై పోరాడింది. తాము కోల్పోయిన పిల్ల ఎలాగో రాదు కాబట్టి ఆ కంపెనీ కి బుద్ధి చెప్పాలని అనుకుంది. పట్టిన పట్టు విడవకుండా పోరాడింది. వివరాలలోకి వెళ్తే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐకియా సంస్థ కి చెందిన అతిపెద్ద షో రూమ్ ఉంది. ఇందులో షాపింగ్ చేయడానికి స్థానికంగా ఉండే ఇద్దరు భార్యా భర్తలు వెళ్ళారు. వారి ఒక్కగానొక్క రెండేళ్ళ  పిల్లాడు జోసెఫ్  ఆడుకుంటూ వెళ్లి అక్కడ ఒక బీరువా కి ఉన్న డ్రస్సర్ ని లాగాడు. దాంతో ఒక్కసారిగా అది ఊడిపోయి పిల్లాడిపై పడిపోవడంతో అక్కడికక్కడే బాబు మృతి చెందాడు. దాంతో

 

ఈ కంపెనీ తయారీ లోపం కారణంగానే మా పిల్లాడు చనిపోయాడని తమకి 300 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కేసు వేశారు. ఈ ఘటన అంతా సుమారు రెండేళ్ళ క్రితం జరిగింది. ఈ కేసుపై పలు మార్లు విచారణ జరిపిన న్యాయస్థానం ఎట్టకేలకి సదరు కంపెనీ బాబు కుటుంభానికి 300 కోట్లు చెల్లించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news