భార్యను చంపి… శవం పక్కన మొబైల్ గేమ్ ఆడుతున్నాడు

-

రాజస్థాన్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. జోధ్పూర్ బిజెఎస్ కాలనీలో భార్యను చంపేసి ఆమె శవం పక్కన గేమ్స్ ఆడుతున్నాడు. విక్రమ్ సింగ్ ఆదివారం రాత్రి తన భార్య శివ కన్వర్‌ ను అతను చంపేసాడు. ఈ విషయాన్ని తల్లి తండ్రులు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి చూడగా… తన భార్య మృతదేహం పక్కన మొబైల్ గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం నిందితుడు తన భార్యను కత్తెరతో చంపాడని చెప్పాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య ఇంట్లో కుట్టు పని చేస్తుంది అని, చాలాకాలంగా నిరుద్యోగిగా ఉన్న సింగ్ తన భార్య పని పట్ల అసంతృప్తిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి తండ్రి మనోహర్ సింగ్ విక్రమ్ సింగ్ పై హత్య కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version