ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి వస్తున్న పుకారులను దక్షిణ కొరియా కొట్టేసింది. అతను బ్రతికే ఉన్నాడని ఆరోగ్యంగా ఉన్నాడని, అతని ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని చెప్పింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే,… విదేశాంగ విధాన సలహాదారు మూన్ చుంగ్-ఇన్ ఒక ప్రకటనలో, తమ ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉందని… జోంగ్ ఉన్ సజీవంగా ఉన్నారని చెప్పారు.
అతను ఏప్రిల్ 13 నుండి వోన్సాన్ ప్రాంతంలో ఉంటున్నాడుని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయన బయటకు రాలేదని చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్ తన తాత మరియు ఉత్తర కొరియా వ్యవస్థాపకుడి 108 వ జయంతి వార్షికోత్సవ కార్యక్రమాలలకు ఆయన హాజరు కాకపోవడంతో కిమ్ ఆరోగ్యం గురించి అనేక వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 15న ఈ కార్యక్రమం జరుగుతుంది.
అయితే ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి మౌనంగా ఉండిపోయింది. మరోవైపు దక్షిణ కొరియా మాత్రం ఆయన బాగానే ఉన్నారని చెప్పడం గమనార్హం. అతని గుండె ఆపరేషన్ జరిగిందని అందుకే అతని ఆరోగ్యం విషమించింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చైనా, జపాన్ దేశాలు మాత్రం అతను మరణించాడు అని చెప్పడం గమనార్హం.