వరల్డ్ కప్ లలో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి, అందులో ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. కాగా తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో చాలా రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇక నిన్న ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో ఏకంగా నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. నిన్నటి వరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14234), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13437) లు ఉన్నారు. కానీ నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ 95 పరుగులు చేయడంతో మొత్తం వరల్డ్ కప్ లో 13437 పరుగులతో సనత్ జయసూర్యను అధిగమించి నాలుగవ స్థానానికి చేరుకున్నాడు.
ఇక మిగిలిన మ్యాచ్ లలో ఇదే తరహాలో ఆడితే మూడవ స్థానానికి చేరుకోవడం చాలా ఈజీ అంటూ క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.