కేసీఆర్ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు పోతుంది…కిషన్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా రాష్ట్ర పరువు పోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా రాజ్యాంగబద్ధమైన నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు. రిపబ్లిక్ డే ను నిర్వహించుకోవడానికి కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగేతర శక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.

Cabinet Reshuffle: G Kishan Reddy

తన కుమారుడు కేటీఆర్ సీఎం అవ్వడేమో అనే భయంతోనే కేసీఆర్ ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కారణం వల్లే ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ కు శకటానికి సంబంధించిన ప్రపోజల్ ను కూడా పంపలేదని అన్నారు. దేశంలో ఎన్నోసార్లు గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు అభిప్రాయ భేదాలు వచ్చాయని… కానీ, కేసీఆర్ మాదిరి ఎవరూ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news