టిడిపితో పొత్తుకు బిజెపి సై.. చంద్రబాబుని గుడ్డిగా నమ్మొద్దు అంటూ కేంద్రానికి రాష్ట్ర నేతలు సూచనలు..

-

బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. మరో నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలుపడే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ.. బిజెపి మద్దతును కోరుతోంది.. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపి కలిసి పోటీ చేస్తాడు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యి పొత్తులపై చర్చించారు..

TDP BJP party

గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీతో తమకు పొత్తు ఉండబోతుందంటూ రాష్ట్రానికి సంబంధించిన పలువురు నేతలు అంతర్గత సమావేశాల్లో చెబుతూ వచ్చారు.. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నమ్మే స్థితిలో బిజెపి నాయకత్వం లేదని.. పార్టీని వాడుకొని వదిలేయడం చంద్రబాబుకు అలవాటు అంటూ బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ రాయబారంతో టిడిపి పొత్తులు ఖరారు చేసుకుందట.. భారతీయ జనతా పార్టీ మాత్రం నిర్దిష్ట ప్రణాళికతో టిడిపితో పొత్తు పెట్టుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది..

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని తాజా సర్వేలు చెబుతున్న నేపథ్యంలో బిజెపి తొలుత పొత్తులపై పునరాలోచనలో పడిందట.. అయితే ఏపీలో పార్టీ మనుగడ కోసం కచ్చితంగా పొత్తులతో పోటీ చేయాలని భావించిందని అందులో భాగంగానే ఐదు ఎంపీ స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను తమ పార్టీ అడుగుతోందంటూ ఓ నేత అంతర్గత సమావేశాల్లో అనుచరులకు చెప్పారట. అరకు రాజమండ్రి నరసాపురం తిరుపతి రాజంపేట ఎంపీ స్థానాలు తమకు ఇవ్వాలంటూ బిజెపి కోరిందట. దాంతోపాటు బిజెపి బలంగా ఉన్న పది అసెంబ్లీ స్థానాలు సైతం ఇవ్వాలని చంద్రబాబు ప్రపోజల్ పెట్టారని బిజెపిలో చర్చ నడుస్తుంది. మూడు పార్టీలు కలిసి వస్తే.. తమ పార్టీకి లబ్ది జరుగుతుందని వైఎస్ఆర్సిపి నేతలు చెబుతున్నారు. మొత్తంగా మూడు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news