మీ నుండి బాప్ బేటా పాలన, నియంతృత్వ పాలన నేర్చుకోవాలా : కిషన్‌ రెడ్డి

-

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరయ్యే బీజేపీ నేతలకు స్వాగతం పలుకుతూ పెట్టిన బీజేపీ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం సహకరించలేదు… మా బ్యానర్ లు తీసేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నుండి నేర్చుకోవాల్సింది… బాప్-బేటా పాలన.. నియంతృత్వ పాలన నేర్చుకోవాలా అంటూ కేటీఆర్‌పై చురకలు అంటించారు.

అంతేకాకుండా.. ఎంఐఎం పార్టీతో కలిసి కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 8 సంవత్సరాల నుండి సెక్రటేరియట్ కు రాలేదని, నెలకు 20 రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటాడంటూ ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. డైనింగ్ టేబుల్ మీద జరిగే మీటింగ్ తెలంగాణ కేబినెట్ మీటింగ్ అంటూ సెటైర్లు వేశారు. అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ వేసుకొని నేరుగా సీఎం బెడ్ రూం వరకు వెళతాడంటూ విమర్శలగు గుప్పించారు కిషన్‌రెడ్డి. ప్రధానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్‌ కనీస ప్రొటోకాల్‌ను కూడా పాటించలేదని ఆయన ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version