మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు అంటే లేబర్స్ కు అడ్డాగా ఉండేదని, 70 ఏళ్లలో గత పాలకులు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. 8ఏళ్లలో 1లక్ష 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో మహిళల పట్ల చిన్న చూపు పోవాలన్నారు. కుల మత తారతమ్యాలు తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించి మంత్రి శ్రీనివాస్ గౌడ్.. 5 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు టార్గెట్ అని చెప్పారు. జనాభాలో 3శాతం ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని, త్వరలో ఐటీ కారిడార్ పూర్తి కానున్నట్లు ఆయన వెల్లడించారు.
మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, మహిళలు ఆకాశం నుంచి అంతరిక్షం వరకు పోతున్నా రన్నారు. 5వేల ఉద్యోగులు ఇచ్చే వరకు అధికారులు ఇక్కడి నుంచి కదలరాదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంలో కూడా గొప్ప అవకాశాలు వస్తాయని, మహిళలకు ప్రత్యేకంగా…50వార్డుల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కు ప్రణాళిక సిద్ధం చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలోనే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా కొంతమందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.