జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరైంది కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జగన్ తో కలసి కేసీఆర్ భోజనం చేయగాలేనిది.. జల వివాదాలపై మాట్లాడటం చేతకాదా? అని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ కావాలనే వాయిదా వేయించాడన్న ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుంటే.. మధ్యవర్తిత్వం చేయటానికి కేంద్రం సిద్ధమని అన్నారు. మహారాష్ట్ర,
తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా? అని అయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తిస్తున్నారన్న ఆయన దుబ్బాక ఉప ఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటామని అన్నారు. ఉప ఎన్నిక బీజేపీ ఇంఛార్జ్ గా జితేందర్ రెడ్డిని నియమించామన్న ఆయన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. త్వరలో మా ఆభ్యర్థిని ప్రకటిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే దాదాపుగా రఘునందన్ రావుకు సీట్ ఖరారు అయినట్టే.