Kishan Reddy : దరఖాస్తులు అవసరం లేకుండానే 6 గ్యారంటీలు అమలు చేయవచ్చు: కిషన్‌ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులంటూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. అప్లికేషన్ ఫారం వెనుక మతలబు ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. అభయ హస్తం అప్లికేషన్ల వెనుక పూర్తిగా రాజకీయ ప్రయోజనం ఉన్నట్లు కనిపిస్తున్నది తప్ప.. ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా లేదని కిషన్ రెడ్డి అన్నారు .

 

దరఖాస్తు చేయకపోతే ప్రభుత్వ సాయం అందదని ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అప్లికేషన్లు అవసరం లేకుండానే ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు చేయవచ్చని ఆయన అన్నారు.

కాలయాపన చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశమని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. .ఉద్యమకారులు,రేషన్‌ కార్డుదారులు,జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని గుర్తు చేశారు. అనవసరంగా ప్రజలను మరోసారి జైళ్ల చుట్టూ,పోలీస్‌ స్టేషన్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతినెలా మహిళలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఇస్తారా.. లేక అందరికీ ఇస్తారా అనేది స్పష్టత ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news