టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

-

ఐపీఎల్‌ 2023 సీజన్ 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ లో అత్యంత బలమైన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒకటి. రెండుసార్లు ట్రోఫీ గెలిచిందంటే మాటలు కాదు! సొంతగడ్డపై దానికి తిరుగులేదు. ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా కకావికలం చేయగలరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లో 3 సార్లు కేకేఆర్‌ గెలిచింది. సన్‌రైజర్స్‌ ఒక్కసారే గెలవగా ఒక మ్యాచ్‌ టై అయింది. 2021లో రెండుసార్లే కేకేఆర్‌నే విజయం వరించింది. 2022లో కేకేఆర్‌, సన్‌రైజర్స్‌ ఒక్కోసారి గెలిచాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీసన్, నితీష్ రానా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, వాషింగ్టన్ సుందర్.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version