అంబేద్కర్‌ విగ్రహం.. చారిత్రాత్మకం : మంత్రి తలసాని

-

నేడు అంబేద్కర్ జయంతి సంధర్బంగా రాంగోపాల్ పేట డివిజన్ వెంగళ్‌రావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఆయన ప్రసంగిస్తూ, అంబేద్కర్‌ సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించడం చారిత్రాత్మకమని వెల్లడించారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ అని తెలిపారు. రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ సేవలను ప్రపంచం మొత్తం గౌరవిస్తుందని తెలియచేశారు.

దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి తలసాని. దళిత బంధు క్రింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు ఆయన. మొదటి విడతలో నియోజకవర్గానికి వందమంది చొప్పున ఆర్ధిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రెండో విడత ఆర్ధిక సహాయం త్వరలోనే అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, మల్లిఖార్జున్ గౌడ్, వెంగళ్ రావు నగర్ అధ్యక్షుడు బాల మల్లేష్, నర్సింగ్ రావు, రాజు, గాలయ్య, ఎల్లయ్య, సాయిలు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version