ఆ విమర్శలు నన్ను చాలా బాధపెట్టాయి: కె ఎల్ రాహుల్

-

ఆదివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియాపైన విజయం సాధించి టైటిల్ ను గెలుచుకోవడంలో ఫేవరెట్ అని నిరూపించుకుంది. ఇండియా కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ మరియు కోహ్లీ లు నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ గతంలో ఏ విధంగా ప్రేక్షకులు అతన్ని విమర్శించారు అన్నది పంచుకుని బాధపడ్డారు. ఈయన మాట్లాడుతూ గతంలో ప్రతి మ్యాచ్ లో నన్ను విమర్శించారు, నేనేమీ అంత దారుణంగా ఆడకపోయినా సరే విమర్శించారు, ఈ విమర్శలు నన్ను చాలా బాధపెట్టాయి అంటూ రాహుల్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయం నేను చాలా లో గా ఫీల్ అయ్యాను అంటూ బాధపడ్డాడు కే ఎల్ రాహుల్.

ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్ లో గాయపడడం తో ఇక వరల్డ్ కప్ ఆడానేమో అని చాలా భయపడ్డాను, కానీ వరల్డ్ కప్ కు సెలెక్ట్ అవ్వడం మొదటి మ్యాచ్ లోనే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version