బీఆర్ఎస్‌-బీజేపీకి ఓటు వేయొద్దు..టీడీపీ ప్లాన్ అదే.!

-

తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి పార్టీ అనేది ఒకప్పుడు..కానీ ఇప్పుడు అది ఏపీకే పరిమితమైన పార్టీ. అక్కడ కూడా అనేక ఇబ్బందుల్లో ఉంది. అధినేత చంద్రబాబు జైలు పాలయ్యారు. దీంతో టి‌డి‌పి కష్టాల్లో ఉంది. అయితే ఇలా కష్టాలు ఉండటానికి జగన్ కక్షతో పాటు..కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి మద్ధతు కూడా ఉందని తెలుగు తమ్ముళ్ళు నమ్ముతున్నారు. బి‌జే‌పి సపోర్ట్ లేకుండా బాబుని జగన్ జైల్లో పెట్టలేరని భావిస్తున్నారు.

అందుకే ఇటు జగన్ అంటే, అటు బి‌జే‌పి అంటే తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. అదే సమయంలో కే‌సి‌ఆర్ పై కూడా తమ్ముళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి కే‌సి‌ఆర్ సహకరించారని, ఇప్పుడు బాబు జైలు పాలైన కనీసం స్పందించలేదని, బాబు కోసం తెలంగాణలో నిరసనలు తెలియజేస్తుంటే కే‌టి‌ఆర్ ఆంక్షలు పెట్టారని, అంటే ఈ కుట్రలో బి‌ఆర్‌ఎస్ హస్తం కూడా ఉందని తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. తెలంగాణలో టి‌డి‌పికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల..గత ఎన్నికల్లో టి‌డి‌పిని అభిమానించే వారు బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేశారు.

కానీ ఈ సారి అలా జరగదని తమ్ముళ్ళు అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. టి‌డి‌పి అభిమానులు, చంద్రబాబుని అభిమానించే వారు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్‌కు, బి‌జే‌పికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. టి‌డి‌పి పోటీలో ఉంటే అక్కడ టి‌డి‌పికి, మిగిలిన చోట్ల కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు.

దీంతో తెలంగాణ ఎన్నికల్లో టి‌డి‌పిని అభిమానించే వారు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్, ఖమ్మంలో టి‌డి‌పి అభిమానులు ఉన్నారు. మిగిలిన చోట్ల కొంతవరకు ఉన్నారు. ఇక వారు బి‌ఆర్‌ఎస్‌కు ఓటు వేయకుండా, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కొన్ని చోట్ల ఫలితాలు మారతాయని అంచనా. చూడాలి ఎంతవరకు తెలుగు తమ్ముళ్ళు తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపగలరో.

Read more RELATED
Recommended to you

Exit mobile version