కేఎంసీ వైద్యవిద్యార్థిని ప్రీతి హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎక్మో వెంటిలేట్పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గా ఉందని చెప్పారు. నిపుణులైన వైద్య బృందం ప్రీతిని నిశితంగా పరిశీలిస్తోందని వివరించారు.
రెండ్రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రీతిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. ఆస్పత్రిలో ప్రీతి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. అసలు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.