రైతులకు గుడ్ న్యూస్.. వాటిపై ఈ స్కీమ్ తో 90 శాతం వరకు సబ్సిడీ..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా కేంద్రం కొన్ని స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. వీటిలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఒకటి. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద రూ.6000 అందజేస్తారు. అలానే వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, ఎరువుల పై సబ్సిడీ మొదలైన స్కీమ్స్ ని కూడా కేంద్రం ఇస్తోంది. ప్రధాన మంత్రి కుసుమ్ పథకం ని కూడా తీసుకు వచ్చింది కేంద్రం.

ప్రభుత్వం రైతులకు సోలార్ పంపులను అమర్చుకునే సదుపాయాన్ని ఈ స్కీమ్ కిందన ఇస్తోంది. 2019లో దీన్ని మొదలు పెట్టారు. రైతులు పొలాలకు నీటిని అందించడానికి విద్యుత్ గొట్టపు బావులను వాడతారు. ఇందులో వారి ఖర్చులు పెరుగుతాయి. తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు ఈ స్కీమ్స్ తో పొందొచ్చు. కుసుమ్ యోజన కింద రైతులు సౌర శక్తిని ఉపయోగించడం వలన తక్కువ ఖర్చు తో మంచి పంటలు వస్తాయి.

రైతులు తమ భూమి లో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 60 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు. 30 శాతం బ్యాంకు ద్వారా రుణం వస్తుంది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://www.india.gov.in/ ద్వారా పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. అలానే ఈ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇలా రైతులు ఈ స్కీమ్ తో అదిరే లాభాలని పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version