డిసెంబరు 22.. జాతీయ గణిత దినోత్సవం.. రామానుజన్ నంబరు గురించి మీకు తెలుసా..?

-

శ్రీనివాస రామనుజన్ పుట్టినరోజుని భారత జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1887 డిసెంబరు 22వ తేదిన తమిళనాడులో జన్మించిన రామానుజన్, గణితంలో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొన్నాడు. ఐతే రామానుజన్ గురించి తెలిసిన వాళ్లకి రామానుజన్ నంబర్ గురించి కూడా తెలిసే ఉంటుంది. 1729.. రామానుజన్ నంబరు.. అసలు ఈ నంబరుని రామానుజన్ నంబర్ అని ఎందుకంటారు. దానికి ఉన్న విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గణితంలో మరిన్ని పరిశోధనల కోసం రామానుజన్ గారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రొఫెసర్ హార్డీతో రామానుజన్ గారికి మంచి పరిచయం ఏర్పడింది. హార్డీగారు రామానుజన్ తో కలిసి అనేక గణిత శాస్త్ర ఫార్మూలాలు కనుక్కున్నారు. ఐతే రామానుజన్ గారు అనారోగ్యానికి గురై మంచం పట్టినపుడు ప్రొఫెసర్ హార్డీ చూడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ల మాటల మధ్యలో రామానుజన్ గారు, హార్డీ.. నువ్వు ఎలా వచ్చావని అడగ్గా, కారులో వచ్చానని బదులిచ్చారు.

ఆ కారు నెంబరు ఎంత అని అడగ్గానే, కారు నెంబరుకి పెద్ద ప్రత్యేకతేం లేదు అని 1729 అని చెప్పాడు. అప్పుడు వెంటనే రామానుజన్ గారు ఆ నంబరుకి ప్రత్యేకత లేదని ఎవరు చెప్పారు. ఆ సంఖ్యని రెండు ఘనాల మొత్తంగా రెండు రకాలుగా రాయవచ్చు. అలా రాయగలిగిన ఒకే ఒక్క నంబరు అది అని చెప్పడంతో హార్డీ షాకయ్యారు. క్షణం కూడా ఆలోచించకుండా నంబరుకి ఉన్న ప్రత్యేకత చెప్పడంతో, హార్డీ ఆశ్చర్యానికి గురయ్యారు.

1729..
ఈ సంఖ్యని 9, 10 ఘనాల మొత్తాన్ని(9*9*9*)+(10*10*10) కలిపితే 1729వస్తుంది.
అలాగే 12, 1 ఘనాల మొత్తాన్ని (12*12*12) + (1*1*1) కలిపినా 1729 వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version