గుడివాడలో కొడాలి నానికి మరో బిగ్ షాక్

-

అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు తిడుతూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వార్తల్లో నిలిచేవారు.కాగా, ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత కొడాలి నాని టార్గెట్‌గా గుంటూరులో ‘చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ కాళ్ల దగ్గర పడుంటా’ అన్నావ్ కదా అంటూ ఫ్లెక్సీలు వెలసిన సంగతి తెలిసిందే. తాజాగా, గుడివాడ వైసీపీ ఆఫీసుపై తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపింది. శరత్ థియేటర్లో 8 సంవత్సరాల క్రితం తాత్కాలిక ఆఫీసును కొడాలి నాని ఏర్పాటు చేశారు. అయితే థియేటర్ ఖాళీ చేయాలని అనేక సార్లు కొడాలి నానిని పార్ట్‌నర్లు రిక్వెస్ట్ చేశారు.

అయితే గతంలో భాగస్వాములపై కొడాలి నాని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే శుక్రవారం యలవర్తి యువసేన పేరుతో థియేటర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ థియేటర్లో గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి పార్ట్‌నర్‌గా ఉన్నారు. ఇక, ఈ ఘటనపై కొడాలి నాని ఎలా స్పందిస్తారు అనేది గుడివాడలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news