చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

-

‘నన్ను ఓడించడం కాదు.. మెజార్టీ తగ్గించండి చూద్దాం’ AP: తన గెలుపోటములు చంద్రబాబు చేతిలో లేవని, అది ప్రజల నిర్ణయం అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో 60 శాతం ఓటింగ్ తమదేనని అన్నారు. ‘నన్ను ఓడించడం కాదు. నా మెజార్టీ 20వేల కంటే తగ్గించాలంటే చంద్రబాబును పుట్టించిన జేజమ్మలు దిగి రావాలి. నేను మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నా’ అని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తనను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ పాదయాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొడాలినాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇకపై మా నా యకుడిపై మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హిందూపురం పార్లమెంట్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ తోటవాసుదేవ, తెలుగుయువత, టీఎన ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు తిరుమలేశ, ఇర్షాద్‌ హెచ్చ రించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం లో వారు కొడాలినానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

నారా లోకేశ్ 400 రో జులు 4వేల కిలోమీటర్ల యువగళం పాద యాత్ర చేపడితే వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే లోకేశ పాదయాత్రతో వైసీపీనేతల గుండెల్లో వణుకు పుట్టిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అదేవిధంగా కొడాలినాని కూడా నారాలోకేశపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇకపై మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చ రించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version