భ‌ద్రాద్రి రామ‌య్యకు కానుక‌గా కొడాలి నాని 13ల‌క్ష‌ల కిరీటం…!

-

ఏపీ మంత్రి కొడాలి నాని భ‌ద్రాద్రి రామ‌య్య స‌న్నిధికి కుటుంబంతో క‌లిసి విచ్చేశారు. సోమ‌వారం ఆయ‌న కుటుంబ స‌మేతంగా వ‌చ్చి రామ‌య్య ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ సంధర్భంగా అర్చకులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అంతే కాకుండా కొడాలి ప‌ద‌మూడు ల‌క్ష‌ల విలువ చేసే బంగారు కిరీటాన్ని ఆల‌య నిర్వ‌హ‌నాధికారి శివాజికి అంద‌జేశారు. ఆ త‌ర‌వాత వేద పండితులు ఆయ‌న‌కు స్వామి వారి ప్ర‌సాదాల‌ను అందజేశారు. అనంత‌రం కొడాలి మీడియాతో మాట్లాడుతూ….తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని అన్నారు.

kodali nani

ఆంధ్ర‌ప‌ద్రేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం అహ‌ర్నిష‌లు క‌ష్ట‌ప‌డుతున్నా సీఎం జ‌గ‌న్ కు స్వామి వారు మ‌రింత శ‌క్తి ప్ర‌సాధించాల‌ని కోరుకున్నారు. ఇదిలా ఉండగా ఏపీ రాజ‌కీయాల్లో కొడాలి నానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి మంత్రిగా ఎంపికయ్యారు. సంధ‌ర్బంగానుసారంగా ఆయ‌న మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించిన వారిపై ఫైర్ అవుతుంటారు. అలా మాస్ లీడ‌ర్ గా ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version