కెప్టెన్ నేను లేదా రోహిత్ అంతే, కోహ్లీ షాకింగ్ కామెంట్స్…!

-

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. రోహిత్ జట్టులో ఉండటం కోహ్లీకి ఇష్టం లేదని కోహ్లీ కెప్టెన్ అవ్వడం రోహిత్ కి ఇష్టం లేదని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేసారు. వీటిపై కోహ్లి గాని రోహిత్ గాని ఇప్పటి వరకు ఒక్క మాట అంటే ఒక్కటి కూడా మాట్లాడిన సందర్భం లేదు.

ఇప్పుడు ఎవరు అయితే తమ ఇద్దరి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారికి కోహ్లీ మరోసారి షాక్ ఇచ్చాడు. రోహిత్ ఆడితే సంబరాలు చేసుకుంటూ ఉంటాడు కోహ్లీ. రోహిత్ సెంచరి సాధిస్తే ఎక్కువగా ఆనంద పడేది అతనే. రోహిత్ ఆట తీరు గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాడు కోహ్లీ. రోహిత్ గురువారం తన 33 వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి విష్ చేసాడు.

రోహిత్ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నాడు కోహ్లీ. ప్రతీ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు అతను. దీనితో ఇన్నాళ్ళు విభేదాలు ఉన్నాయి వాళ్లకు గొడవలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు అందరూ మరోసారి షాక్ అయ్యారు. తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. రోహిత్ శర్మను టి20 కెప్టెన్ ని చెయ్యాలని బోర్డ్ భావిస్తుంది. దీనికి కోహ్లీ అభిప్రాయం అడిగింది… బౌలర్ ని కెప్టెన్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా అడిగింది.

దీనికి కోహ్లి తన మనసులో మాటను బయటపెట్టాడట. కెప్టెన్ ని చేస్తే రోహిత్ ని లేదా కెఎల్ రాహుల్ ని చెయ్యాలని లేకపోతే తానే ఉంటాను అని స్పష్టంగా చెప్పాడట. వేరే ఎవరిని చేసినా సరే తాను మద్దతు ఇవ్వను అంటూనే ముందు రోహిత్ అడిగిన తర్వాత తాను సిద్దంగా లేను అంటే మాత్రం కెఎల్ రాహుల్ పేరుని పరిశీలించాలి అని సూచించాడు అని బోర్డ్ వర్గాలు చెప్పాయి. కోహ్లీ మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version