కాజల్ ని వదలమంటున్న స్టార్ హీరోలు …అందుకోసమేనా ..!

-

కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతోంది. 2007 లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంటరయింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత నటించిన చందమామ, మగధీర సినిమాలతో ఏకంగా స్టార్ హీరోయిన్ అన్న పేరు సంపాదించుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరి హీరోలందరి సరసన నటించింది. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు నటించిన సినిమాలన్ని దాదాపు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాయి.

 

కాజల్ అగర్వాల్ కెరీర్ లో సక్సస్ లే ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు తను నటించిన తమిళ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో అక్కడ కూడా కాజల్ కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలతో నటించిన హీరోయిన్ గా కాజల్ కి మంచి క్రెడిట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 లో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే కాజల్ ఇప్పుడు ఎక్కువగా సీనియర్, స్టార్ హీరోలందరకి బెస్ట్ ఛాయిస్ గా మారింది.

 

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవి సరసన నటిస్తుంది కాజల్. వాస్తవంగా ఈ సినిమాలో ముందు నయనతార అనుకున్నారు. తర్వాత తమన్నా, త్రిష అనుకున్నారు. కాని వాళ్ళందరిని కాదని ఫైనల్ గా కాజల్ ని తీసుకున్నారు. ముఖ్యంగా త్రిష ని కాదని మళ్ళీ కాజల్ ని తీసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉందట. గతంలో చిరంజీవి త్రిష కాంబినేషన్ లో వచ్చిన స్టాలిన్ ఫ్లాప్ గా మిగిలింది. కాని కాజల్ నటించిన ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్టయింది. అదీకాక చిరంజీవి పక్కన పేయిర్ గా కాజల్ బావుంటుందన్న ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఫైనల్ గా కాజల్ నే ఎంచుకున్నారు.

 

ఇక తమిళంలోను కమల్ హాసన్ కి జంటగా ఇండియన్ 2 లో కాజల్ నటిస్తుంది. అక్కడ కూడా ఇదే కారణం. కమల్ హాసన్ కాజల్ ది ఫ్రెష్ కాంబినేషన్ కాబట్టి కాజల్ ని ఎంచుకున్నారు కమల్, శంకర్. ఇక తన చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ కూడా వచ్చి పడిందని తాజా సమాచారం. ఏ.ఆర్ మురగదాస్ విజయ్ కాంబినేషన్ లో తుపాకి 2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో కాజల్ ని ఎంపిక చేసుకున్నారట. ఇదే కాంబినేషన్ లో తుపాకి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మురగదాస్ తుపాకి 2 కి ముందు అనుకున్న హీరోయిన్ సమంత..కీర్తి సురేష్. కాని సీక్వెల్ లో కూడా కాజల్ ఉంటే కాంబో పర్‌ఫెక్ట్ గా ఉంటుందని కాజల్ ని సెలెక్ట్ చేసుకున్నారట. మొతానికి కాజల్ సీనియర్ హీరోలకి, స్టార్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ గా క్రేజీగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version