గత టీ20 వరల్డ్ కప్లో చేసిన తప్పుల్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారి రిపీట్ చేయరని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశారు. ‘2022 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ పై సెమీస్లో భారత్ 168 రన్స్ మాత్రమే చేసింది. 16 ఓవర్లలోనే ఇంగ్లండ్ టార్గెట్ ఛేదించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అప్పుడు చాలా నెమ్మదిగా ఆడారు. కానీ ఇప్పుడు వారి ఆటలో వేగం పెరిగింది. ఈసారి ఆ తప్పు రిపీట్ కాదు’ అని ఆయన అన్నారు.
కాగా, ఈసారి జరగబోయే ప్రపంచ కప్ జూన్ 2 న మొదలై జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి.ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.టీ20 వరల్డ్ కప్ కి ఎంపికైన జట్టు లో ఇప్పటికే కొందరు క్రికెటర్లు న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే.జూన్ 2న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.