ఆ కేసులో కోల్‌కతా సంచలన తీర్పు..?

-

చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే సర్వహక్కులు ఉంటాయని కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మరణించిన వ్యక్తి వీర్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారణ చేపట్టిన కోర్టు తుది తీర్పును వెలువరించింది. గతేడాది మార్చి నెలలో ఓ తండ్రి, దిల్లీలోని స్పెర్మ్‌ బ్యాంకులో దాచిన చనిపోయిన కుమారుడి వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తుందని కోర్టు మెట్లేక్కాడు. ఆ వీర్యం చెడిపోయినా, ధ్వంసమైనా తమ వంశం నాశనం అవుతుందని తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నాడు. జస్టిస్‌ సభ్యసాచి భట్టాచార్య మంగళవారం ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

‘తండ్రీ కొడుకుల సంబంధం ఉన్నంత మాత్రం పిటిషనర్‌( చనిపోయిన వ్యక్తి తండ్రి) వీర్యాన్ని పొందటానిక ఎలాంటి ప్రాథమిక హక్కులను కలిగిలేరు. చనిపోయిన వ్యక్తి వీర్యంపై కేవలం అతడి భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. ఈ విషయంలో కోర్టు ఆమెను ఏ విధంగా కూడా ఆదేశించలేదు’ అని స్పష్టం చేశారు.

భార్య అనుమతి తప్పనిసరి..

కోల్‌కతాకు చెందిన పిటిషన్‌ వేసిన వ్యక్తి కుమారుడు తలసీమియా వ్యాధితో బాధపడుతుండటంతో దిల్లీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స కూడా తీసుకునేవాడు. 2015లో దీల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకోగా, 2018లో అతడు మరణించాడు. కాగా, మరణానికి ముందే దిల్లీలోని స్పెర్మ్‌ బ్యాంకులో అతడి వీర్యాన్ని దాచారు. ఈ నేపథ్యంలో స్పెర్మ్‌ బ్యాంకులోని తమ కుమారుడి వీర్యాన్ని రెండేళ్ల ఒప్పంద కాలం ముగిసేవరకు భద్రంగా ఉంచాలని తల్లిదండ్రులు బ్యాంకుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పెర్మ్‌ బ్యాంక్, వీర్యాన్ని అతడి భార్య గర్భం దాల్చడానికి ఉపయోగించాలన్నా.. లేక, వేరే వాళ్ల కోసం వాడాలన్నా.. పాడేయాలన్నా అందుకు అతడి భార్య అనుమతి కచ్చితంగా అవసరమని తెలిపింది. దీంతో వారు తమ కోడల్ని వీర్యం విషయమై నో అబ్జెక్షన్‌ లెటర్‌(ఎన్‌ఓసీ) ఇవ్వవల్సిందిగా కోరాగా అందుకు ఆమె తిరస్కరించడంతో వారు కోర్టును ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news