వైసీపీ vs జనసేన..రాజకీయరంగు పులుముకున్న వింత వ్యాధి

-

పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి రాజకీయరంగు పులుముకుంటోంది. రాష్ట్రంలో వరుస ఘటనల వెనక రాజకీయ కుట్ర ఉందని మంత్రి ఆళ్లనాని వ్యాఖ్యలపై.. జనసేన మండిపడుతోంది. ప్రభుత్వ ఉదాసీనత వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు..మంత్రి నాని వ్యాఖ్యల పై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించడంతో వివాదం కొత్త టర్న్ తీసుకుంది.

వింత వ్యాధి వెనక రాజకీయ కుట్ర ఉందన్నారు మంత్రి ఆళ్లనాని. రాజకీయాలకోసం దేవుళ్లను లాగారని ఆరోపించారు. ఇప్పుడు జనాన్ని లాగుతున్నారని మండిపడ్డారు. జనం రోగాలతో ఇబ్బందిపడుతుంటే, పార్టీలొచ్చి గొడవ చేస్తున్నాయన్నారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలే జనసేన,వైసీపీ మధ్య కాక రేపుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో గంట గంటకూ వింత వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భీమడోలు మండలం పూళ్లలో బాధితుల సంఖ్య 36కి చేరింది. ఇక కొమరేపల్లిలో వింత వ్యాధితో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి బాధితులు కిందపడిపోతున్నారు. ఏలూరు తరహా లక్షణాలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నాలుగు రోజుల్లోనే 50కి పైగా వింత వ్యాధి కేసులు నమోదు అయ్యాయి. భీమడోలు, దెందులూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య 54కి చేరింది. మంత్రి ఆళ్లనాని పరామర్శిస్తుండగానే ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.

ఆలయాల విధ్వంసం, వింతవ్యాధి వెనక టీడీపీ, జనసేన ఉన్నాయన్న మంత్రి ఆళ్లనాని వ్యాఖ్యలపై.. జనసేనాని పవన్ కళ్యాణ్ సెటైర్‌ వేశారు. మరోవైపు కొమిరేపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వింతవ్యాధి పరిస్థితులను తెలుసుకు నేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తల్ని.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ , జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news